
హైదరాబాద్, వెలుగు: బడ్జెట్లో హైదరాబాద్ సిటీకి అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ఎమ్మెల్యే కేపీ.వివేకానంద అన్నారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్సిటీపై కాంగ్రెస్సర్కారు పగబట్టిందని, అంత మంది జనాభా ఉండి కూడా ఒక్క మంత్రి లేకపోవడం అన్యాయమని విమర్శించారు. ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిపించలేదని ప్రజలపై సీఎం రేవంత్‌రెడ్డి కోపంగా ఉన్నారని ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌తో భట్టి ప్రజలను పక్కదారి పట్టించారని ఫైర్ అయ్యారు. సిటీలో డ్రైనేజీ సిల్ట్తీయడంపై కూడా భట్టి అబద్ధాలు చెప్పారని విమర్శించారు.
హైదరాబాద్సిటీకి చేసిన అన్యాయంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఢిల్లీకి డబ్బులు పంపే పనిలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారని తెలిపారు. సిటీలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోలేదన్నారు. గాంధీ, ఉస్మానియా లాంటి పేదల ఆసుపత్రులకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. మెట్రోపై స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు. ఫోర్త్ సిటీ పేరుతో భూ దందాలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు