ఫోన్ ట్యాపింగ్ చేసిండొచ్చు.. ఇదేమైనా అంతర్జాతీయ కుంభకోణమా : కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ చేసిండొచ్చు.. ఇదేమైనా అంతర్జాతీయ కుంభకోణమా : కేటీఆర్

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ​ట్యాపింగ్ వ్యవహారంపై మొదటిసారి స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. 2024 మార్చి 27వ తేదీ బుధవారం రోజున మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్  పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ఆరు గారడీలతో కాలం గడుపుతుందని  విమర్శించారు.  

పదిలక్షల ఫోన్లను  కేసీఆర్ ట్యాప్ చేశారని  కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందని...  చేస్తే గిస్తే ఒక్కరో ఇద్దరివో ఫోన్లు ట్యాపింగ్ చేసుండొచ్చు .. నాకేం తెలుసు..  దొంగల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే పోలీసుల పని అని కేటీఆర్ చెప్పుకోచ్చారు.   కానీ దీనిని కాంగ్రెస్ అంతర్జాతీయ కుంభకోణం లాగా చూపిస్తూ  డ్రామాలు చేస్తుందని మండిపడ్డారు.  సీఎంగా ఉన్న  రేవంత్  దీనిపై  చర్యలు తీసుకోవాలి కానీ ఇలాంటి పనికిమాలిన డ్రామాలు ఆపాలన్నారు.  

Also Read: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపికి రఘునందన్రావు ఫిర్యాదు

రేవంత్ కు పాలన చాతకావడం లేదని .. లీకులతో కాలం గడుపుతున్నారని విమర్శించారు కేటీఆర్.  హీరో నాగార్జున  గ్రీకువీరుడు అయితే  సీఎం రేవంత్ రెడ్డి లీకువీరుడని ఎద్దేవా చేశారు.  రైతు బంధు, ఆరు గ్యారెంటీలను ప్రజలను  డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ సర్కార్ ఇలాంటివి చేస్తుందని విమర్శించారు.   రూ. 2 లక్షల రుణమాఫీ పొందినవాళ్లు కాంగ్రెస్ కు ఓటెయ్యాలని, కానివాళ్లంతా బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.