టూరిజంకు మేము ఏమీ చేయలేదా? : ఎమ్మెల్యే కేటీఆర్

టూరిజంకు మేము ఏమీ చేయలేదా? : ఎమ్మెల్యే కేటీఆర్
  • యాదాద్రి గుడి, అంబేద్కర్ విగ్రహం కట్టిందెవరు: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: టూరిజం అభివృద్ధికి మేం ఏమీ చేయలేదని మంత్రి మాట్లాడడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో పర్యాటక శాఖపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ప్రసంగంలో కొన్ని అంశాలపై కేటీఆర్ ​క్లారిఫికేషన్ అడిగారు. ‘‘రామప్ప దేవాలయానికి యునెస్కో హెరిటేజ్ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేశాం. కులీకుతుబ్​షా టూంబ్స్ రీక్రియేషన్ చేశాం, యాదాద్రి గుడి, మొజం జాహీమార్కెట్​ను తీర్చిదిద్దాం.

ముర్గీచౌక్, మీర్ ఆలం ట్యాంక్ రీస్టోర్ చేశాం” అని కేటీఆర్ పేర్కొన్నారు.  గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ నిర్వహించామని తెలిపారు. 200 ఎకరాల్లోని బుద్ధవనం ప్రాజెక్ట్​ను జాతికి అంకితం చేశామన్నారు. కొల్లాపూర్​ లో సోమశిలలో రిసార్ట్​లు కట్టామని తెలిపారు. 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టామన్నారు. తాము నిర్మించిన అమరవీరుల జ్యోతిని టూరిజం డెవలప్​మెంట్ కు వాడుకోవడం లేదన్నారు.