అందరి ముందే ఏడ్చేసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్

అందరి ముందే ఏడ్చేసిన ఎమ్మెల్యే  కూసుకుంట్ల ప్రభాకర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. చౌటుప్పల్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా  హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావుకు తనకు మధ్య ఉన్న అనుభందం గురించి, హరీశ్ రావు తనకు చేసిన సహకారం గురించి తలుచుకుంటూ ప్రభాకర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.  దీంతో పక్కనే ఉన్న హరీశ్ రావు కూసుకుంట్లను ఓదార్చే ప్రయత్నం చేశారు.

https://www.youtube.com/watch?v=56Rxx8zsuEs


2003లో కళ్లెం యాదగిరి రెడ్డి  తనను హరీశ్ రావుకు పరిచయం చేసి టీఆర్ఎస్ లో చేర్పించిండని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్పారు.  ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు  హరీశ్ రావు  తనకు ఎప్పుడు  ఏ సహాయం కావాలన్నా  చేశారన్నారు.  ఆ నాడు  సాంబశివుడిని హత్య చేసినప్పుడు పరిస్థితులు బాగలేవంటే వెంటనే కమిషనర్ దగ్గరకు తీసుకెళ్లి తనకు  పిస్తల్ లైసెన్స్ ఇప్పించి సహకరించిన  వ్యక్తి హరీశ్ అంటూ భావోద్వేగానికి గురయ్యారు కూసుకుంట్ల.