కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. లేటెస్ట్ గా ఆ టిప్పర్ లారీ (TS08 UJ0025)ను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. ప్రమాదం జరిగిన దగ్గరి నుంచి ముత్తంగి ఎగ్జిట్ వద్ద గల సీసీ కెమెరాల ఆధారంగా RTO అధికారుల సహకారంతో టిప్పర్ వెనక భాగంలో డ్యామేజీ అవడంతో పటాన్ చెరు పోలీసులు గుర్తించారు. ఈ టిప్పర్ రాక్ స్యాండ్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. టిప్పర్ ను నడిపిన డ్రైవర్ ను కూడా పోలీసులు గుర్తించారు.
ALSO READ :- Odela 2: ఓదెల 2 మొదలయ్యింది.. వైలెన్స్కి ఈసారి గ్లామర్ తోడయింది
ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున లాస్య నందిత కారు పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురై మరణిచారు. ఆమె కారు అదుపుతప్పి లారీ ఢీకొట్టి రెయిలింగ్ ను గుద్దడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే చనిపోగా.. కారు నడిపిన పీఎ ఆకాశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుం ఆకాశ్ ఆస్పత్రిలో చికిత్స పొంతున్నాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు... ఆకాశ్ నిద్రమత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.