సీఎం రేవంత్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

సీఎం రేవంత్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్టారావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారానికి వెంటనే  నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీల ఛాంబర్లో  సీఎం రేవంత్ ను   కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నూతన రోడ్ల నిర్మాణం, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి నూతన పైప్ లైన్ ల నిర్మాణం, పార్కులు, శ్మశాన  వాటికల నిర్మాణం (మిగిలిన పనులకు) సుమారుగా రూ. 25-30 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలని కోరారు.

 అదే విధంగా కూకట్పల్లి మండలం పరిధిలోని హైదర్ నగర్ గ్రామం సర్వే నెంబర్ 145,163 లలో నిర్మాణ అనుమతులను నిలిపివేసి స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని,  దశాబ్దాల కాలంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా గానీ ప్రభుత్వపరమైన అన్ని అనుమతులను జారీ చేశార చెప్పారు. ఇటీవల కాలంలో అకస్మాత్తుగా నిర్మాణ అనుమతులను నిలిపివేశారని సీఎం  దృష్టికి తీసుకువెళ్లారు.  

అదే విధంగా జేఎన్టీయూ వెనుక ఉన్న సాయి నగర్ కాలనీ వాసుల ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు కృష్ణారావు. 2014 కు ముందు ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు డబ్బులు చెల్లించేందుకు కాలనీ వాసులు సిద్ధంగా ఉన్నారని వారికి న్యాయం చేయాలని కోరారు. అన్ని విషయాలను వివరంగా తెలుసుకున్న సీఎం రేవంత్ వినతి పత్రాలను సంబంధిత అధికారులకు పంపిస్తానని త్వరలోనే పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.