ఫ్లెక్లీల్లో ఫోటో పెట్టలేదని..ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దౌర్జన్యం

ఫ్లెక్లీల్లో ఫోటో పెట్టలేదని..ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దౌర్జన్యం

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీరంగం సృష్టించారు. వెంగళరావు నగర్‌లో తన అనుచరులతో కలిసి  గణేశ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దాడి చేశారు. బోనాల వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో ఎందుకు పెట్టలేదంటూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గణేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఓ వైపు  మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే..ఆయన అనుచరులు గణేష్ ఇంట్లోకి చొచ్చుకు వెళ్లి విచక్షణ రహితంగా దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ఏం చేయలేక చేతులెత్తేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దౌర్జన్యానికి సంబంధించిన  దృశ్యాలు సీసీ కెమెరాలల్లో రికార్డ్ అయ్యాయి.