- కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలే
- త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాను
- టీడీపీలో ఇద్దరం కలిసే పనిచేశాం.. మీడియాకు ముందే చెప్పి వెళ్తా..
- నన్ను పార్టీ మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయుమంటుంది
- నా కుమారుడు భద్రారెడ్డికి ఇవ్వాలని కోరుతున్నా
- మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఐదేళ్లలో ఏమైనా జరగొచ్చని.. అదృష్టం ఉంటే తాను మళ్లీ మంత్రి కావొచ్చెమొనని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. తాము ఓడి, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. ఆ షాక్ నుంచి తామింకా తేరుకోలేదని అన్నారు.
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని అన్నారు. ఎలాంటి ఊహాగానాలకు తావులేకుండా విషయాన్ని ముందుగా మీడియాకు చెబుతానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కలిస్తే తప్పేముందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తాను ఇద్దరం టీడీపీలో కలిసి పనిచేశామని గుర్తు చేశారు. మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేయాలని పార్టీ తనను కోరిందని, తన కుమారుడు భద్రారెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీకి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.