సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. అక్టోబర్ 9న ఉదయం జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంటికెళ్లిన మల్లారెడ్డి రేవంత్ ను కలిశారు. తన మనవరాలి పెళ్లి రావాలంటూ ఆహ్వాన పత్రిక అందజేశారు. రేవంత్ ను కలిసే సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అక్కడే ఉన్నారు. రెండు రోజుల క్రీతం ఏపీ సీఎం చంద్రబాబును కూడా కలిశారు.
రాజకీయ వర్గాల్లో రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి భేటీపై చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీళ్లు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీకి సంబంధించిన కాలేజ్ బిల్డింగ్ ను అధికారులు కూల్చేశారు. దీనిపై అప్పట్లో రచ్చరచ్చ అయ్యింది. మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కూడా కలిసారు. మల్లారెడ్డి కాంగ్రెస్ లో కి వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే రేవంత్ ఒప్పుకోలేదని కూడా చర్చ జరిగింది. మళ్లీ చాలా రోజులకు వీళ్లిద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.