మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైరయ్యారు. సమస్యలపై ప్రజలు ఫోన్ చేస్తే కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని.. ఆరు గ్యారెంటీలకు తోడుగా ఆయన బూతులను ఏడో గ్యారెంటీగా ఇస్తున్నాడని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని.. ఆయనను అవేశం స్టార్ గా మారరని ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మీ చెక్కులు తనతో పంపిణీ చేయవద్దని పొన్నం ఎమ్మార్వోలతో మాట్లాడిన ఆడియోలు బయటకు వచ్చాయని.. అలాంటి మాటలు సిగ్గు చేటని విమర్శించారు. ఆర్డీవోపై చర్యలు తీసుకుంటే మంత్రి పొన్నంపై కూడా చర్యలు తీసుకుని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్డీవో, ఎమ్మార్వోలకు తన నుండి ఒక్క ఫోన్ కాల్ వచ్చినట్లు ఉన్నా.. తాను ఎలాంటి ఛాలెంజ్ కైనా సిద్ధమని కౌశిక్ సవాల్ విసిరారు. ఈ ఆవేశం స్టార్ కు మంత్రి పదవి కుక్కకి బొక్క దొరికినట్టుగా ఉందన్నారు. దానం నాగేందర్ పార్టీ మారడంపై స్పీకర్ ఫిర్యాదు చేశామని.. అయినా, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా దానం నాగేందర్ ని ప్రకటించారని అన్నారు. ఇప్పటికైనా దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరుతున్నట్లు పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు.