హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్లో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని కరీంనగర్ కు తరలించనున్నట్లు తెలుస్తోంది.
ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో తనపై కౌశిక్ రెడ్డి దాడి చేశారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడి చేశారని కంప్లయింట్ తో పోలీసులు కేసు నమోదు చేసి ఇవాళ అరెస్ట్ చేశారు.
ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు.సంజయ్ తోపాటు సభకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై ఆర్డీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజయ్ ఫిర్యాదుతో కౌశిక్ రెడ్డిపై ఐదు కేసులు నమోదు చేశారు.
ఆదివారం (జనవరి 12, 2025) మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ జరిగిన జిల్లా అభివృద్ది పై జరిగిన మండలి సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
కౌశిక్ రెడ్డి తనపై దాడి చేశారని ఎమ్మెల్యే సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్, అతని పీఏ, కరీంనగర్ ఆర్డీవో ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై 132,115(2), 352, 292 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.