గాంధీ ఇంటికి బయల్దేరిన కౌశిక్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు..బాచుపల్లిలో ఉద్రిక్తత

గాంధీ ఇంటికి బయల్దేరిన కౌశిక్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు..బాచుపల్లిలో ఉద్రిక్తత

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి బయల్దేరిన బీఆర్ఎస్  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని  అడ్డుకున్నారు పోలీసులు.బాచుపల్లిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి నుంచి వివేకానంద నగర్ లోని అరికెపూడి గాంధీ ఇంటికి బయలు దేరిన కౌశిక్ రెడ్డి,  బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్లకు ఓ న్యాయం..మాకో న్యాయమా అంటూ పోలీసులను ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తున్నామని చెప్పారు. దీంతో  బలవంతంగా కౌశిక్ రెడ్డి..శంభీపూర్ రాజును ఇంట్లోకి పంపించారు పోలీసులు. గాంధీ ఇంటికి వెళ్లడానికి అనుమతి లేదంటూ చెప్పారు. కౌశిక్ రెడ్డిని బయటకు రానివ్వడం లేదు. బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Also Read:-సీఎం కేజ్రీవాల్ కు బెయిల్

అటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను ఎక్కడిక్కడ ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముట్టడికి పాడి కౌశిక్ రెడ్డి పిలుపునివ్వడంతో బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కౌశిక్ రెడ్డి ముందుగానే బీఆర్ఎస్  నేత శంబిపూర్ రాజు నివాసానికి చేరుకున్న కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి గాంధీ ఇంటికి బయల్దేరారు.   అయితే  ఎట్టిపరిస్థితుల్లో గాంధీ ఇంటికి వెళ్తామన్నారు కౌశిక్ రెడ్డి.

 మరో వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరోసారి విరుచుకు పడ్డారు.  ఇది బీఆర్‌ఎస్‌కు, గాంధీకి యుద్ధం కాదని..  చీటర్‌, బ్రోకర్‌తో ఫైట్‌ చేస్తున్నానని ఘాటు  వ్యాఖ్యలు చేశారు. తాను క్రమశిక్షణ గల నేతనని.. తనను రెచ్చగొట్టడం వల్లే చిల్లరగాడితో ఫైట్‌ చేస్తున్నానని అన్నారు.  కౌశిక్‌రెడ్డి   ఎంతో మందిని మోసం చేసిన  చీటర్‌ అని ధ్వజమెత్తారు. కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని.. ఆంధ్రా, తెలంగాణ పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.