పాడి కౌశిక్ రెడ్డి.. హుజూరాబాద్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే.. నియోజకవర్గ ప్రజలకు ఆదర్శంగా ఉంటూ.. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉండి వారికి రావలసిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్ గ్రామసభలో బూతు పురాణం మొదలు పెట్టారు. దీనిని చూసిన గ్రామస్తులు.. అధికారులు నివ్వెర పోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
ఎమ్మెల్యే అంటే స్థానిక సమస్యలను పరిష్కరిస్తూ.. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండాలి. అలా ఉండాల్సిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్ గ్రామసభలో తిట్ల పురాణాన్ని మొదలు పెట్టారు. గ్రామసభలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే .. తాను ప్రజా ప్రతినిథిని అని మరిచి... అక్కడ సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి తిట్టారు.
Also Read :- ఫిల్మ్ నగర్, బసవతారం జంక్షన్లలో స్టీల్ ఫ్లై ఓవర్లు
ఏం బతుకులు రా మీవి అంటూ కొన్ని బూతు పదాలు ఉపయోగించారు. ఇలా మాట్లాడుతుండగా స్థానికులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో సహనం కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు..నకిలీ నాయకులంటూ ఫైర్ అయ్యారు.ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు పట్ల స్థానికులు విస్మయం చెందారు.