ఎలాంటి అవినీతి చేయలేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే భర్త ప్రమాణం

 ఎలాంటి అవినీతి చేయలేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే భర్త ప్రమాణం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలతో పాటుగా ఇతర అంశాల్లో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తడిబట్టలతో అమ్మవారి ముందు ప్రమాణం చేశారు బీఆర్ఎస్ లీడర్, మెదక్ ఎమ్మెల్యే పద్మ భర్త  దేవేందర్ రెడ్డి. సొంత పార్టీకి చెందిన అసమ్మతి నేతలు దేవేందర్ రెడ్డి అవినీతిని నిరూపిస్తామని ప్రకటించిన నేపథ్యంలో  దేవేందర్ రెడ్డి ఈ ప్రమాణం చేశారు.  ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. రాజకీయంగా ఎదురుకోలేక లేనిపోని ఆరోపణలు తనపై చేస్తున్నరని తెలిపారు.