హైదరాబాద్: డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు వైద్యులు చికిత్స చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎలాంటి ప్రాణప్రాయం లేదని డాక్టర్లు తెలిపారు. 2025, జనవరి 21 రాత్రి ఆయన హైద్రాబాద్‌కు రానున్నారు.
తమ అభిమాన నేతకు గుండె పోటు వచ్చిందని తెలియడంతో పద్మారావు గౌడ్ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురి అయ్యారు. పద్మారావు గౌడ్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలపడంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండె పోటుకు గురయ్యారని తెలియడంతో బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటికి తరలి వెళ్తున్నారు. పద్మారావు గౌడ్ హెల్త్ కండిషన్‌పై బీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీసినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.