హైకోర్టును ఆశ్రయించిన BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్ ప్రాంతంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. వరుసగా అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. అనురాగ్ యూనివర్సిటీ నాదం చెరువు బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేస్తోందని ఇరిగేషన్ అధికారులు పోలీసులు, హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణాలు హైడ్రా కూల్చివేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. 

Also Read :- ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తుమ్మిడి చెరువు ఎఫ్టీఎల్‌లో నిర్మాణం

దీంతో BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం హైకోర్టు ను ఆశ్రయించారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. అన్నీ అనుమతులు తీసుకున్న తర్వాతనే యూనివర్సిటీ నిర్మాణాలు చెప్పట్టామని పల్లా తరపు న్యాయవాది తెలిపారు. ల్యాండ్ డాక్యుమెంట్స్, అనుమతుల పత్రాలు చెక్ చేసిన తర్వాతనే నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.