హైదరాబాద్, వెలుగు: లగచర్ల ఘటనలో నిందితుడైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. రిమాండ్‌కు పంపుతూ కింది కోర్టు జారీ చేసిన డాకెట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి బుధవారం ఉత్తర్వులు వెలువరించారు. రిమాండ్‌కు ఆదేశిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపారు. రిమాండ్‌కు కారణాలను మేజిస్ట్రేట్ పేర్కొన్నారని తెలిపారు. అయితే, పట్నం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై చట్టప్రకారం విచారించి నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టును ఆదేశించారు.