సీఎం కేసీఆర్ తప్పకుండా స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ టికెట్ తనకే ఇస్తారని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. టికెట్ల కేటాయింపులో మళ్లీ మార్పులు జరిగే అవకాశం ఉందని.. తప్పకుండా స్టేషన్ ఘన్ పూర్ టికెట్ తనకు రావొచ్చని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగలది కీలక పాత్ర అని.. మాదిగల అస్థిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్ దేనన్నారు. తనకు టికెట్ రాకపోవడంపై మాదిగలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. మందకృష్ణ లాంటి వాళ్లు తనకే మద్దతిస్తున్నారని తెలిపారు.
ఎమ్మార్పీఎస్ నుంచి తన ప్రస్థానం మొదలైందన్నారు రాజయ్య. పార్టీ జాబితాలో చేర్పులు,మార్పులు ఉంటాయని..రాష్ట్ర సాధనకు కృషి చేసిన తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు. ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు ఇస్తామంటున్నారు... కానీ తనకు ఎమ్మెల్యేనే కావాలన్నారు. పార్టీ మారడమా లేదా అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు.