బీఆర్ఎస్ ఎమ్మెల్యే దత్తత గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు కోసం మహిళల ధర్నా

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్ బాబు దత్తత గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోనే నీళ్ల కొరత ఉంటే మిగితా గ్రామాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 

బోరుబావి నీటిలో ఫ్లోరైడ్ రావడంతో అనారోగ్యానికి గురవుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ ముందు ధర్నా చేపట్టారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే రమేష్ బాబు మంచినీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు.