
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తీవ్ర విమర్శలు చేశారు. భూమికి మూరెడు ఉంటడని.. బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లు చేయడమే రేవంత్ నైజం అంటూ ఆరోపణలు చేశారు. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన రెడ్యా నాయక్.. రాహుల్ గాంధీనీ సస్పెండ్ చేస్తే ఓ పీసీసీ చీఫ్ గా రేవంత్ కనీసం నిరసన కార్యక్రమాలు చేయలేదని ఎద్దేవా చేశారు. అదే తానయితే రాష్ట్రంలో హల్ చల్ చేసేటోడినంటూ రెడ్యా నాయక్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయనను దించాలని చూస్తున్నారన్నారు.
ఈ ఒక్కసారి తాను ఎన్నికల్లో నిలబడతానన్న రెడ్యా నాయక్..బీఆర్ఎస్ కు ఈ సారి 90 కి పైగా సీట్లు వస్తాయన్నారు. ఎన్టీ రామారావు అటువంటి గాలిలో 26 వేల మెజార్టీతో గెలిచానని...2014 లో టీఆర్ఎస్ గాలిలో సైతం 25 వేల మెజార్టీ తో గెలిచనన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క పథకం కూడా ఇవ్వడం లేదన్నారు.