
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్కు నిరసన సెగ తగిలింది. మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సమస్యలు చెప్తున్నా.. రెడ్యా నాయక్ పట్టించుకోకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ప్రయత్నించారు. కారు దగ్గరకు వెళ్లి సమస్యలు చెప్పడానికి ప్రయత్నించగా..ఆయన సమయం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అబ్బాయిపాలెం ప్రజలు..కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెడ్యా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు..నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులను పక్కకు లాక్కెళ్లారు.