పార్లమెంట్ ఎన్నికలకు ముందు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతుండటంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు.. అధి నాయకులకు సూచిస్తున్నారు. ఆదివారం కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితోపాటు పలువురు సోమవారం స్పీకర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
కాగా, నిన్న గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు కాంగ్రెస్ చేరిన సంగతి తెలిసిందే. ఇక, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరీ రమేష్ లు ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.