బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలి.. ట్రాన్స్ జెండర్​ ట్రాఫిక్ అసిస్టెంట్ల డిమాండ్​

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలి.. ట్రాన్స్ జెండర్​ ట్రాఫిక్ అసిస్టెంట్ల డిమాండ్​

ట్యాంక్ బండ్, వెలుగు: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమను అవమానించారని ట్రాన్స్ జెండర్​ట్రాఫిక్ అసిస్టెంట్లు ప్రేమ్ లీలా, నిషా, సోనియా ఆరోపించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ట్యాంక్ బండ్ పై శ్రీశ్రీ విగ్రహం ఎదుట తోటి ట్రాఫిక్ అసిస్టెంట్లతో కలిసి నిరసన తెలిపారు. తమ ప్రభుత్వం 50 మంది ట్రాన్స్ జెండర్లను పైలట్ ప్రాజెక్టు కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ హేళనగా నవ్వారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమను మనుషులుగా గుర్తించి, ఉద్యోగం ఇచ్చారని తెలిపారు.  మరోసారి ఇలా అవమానిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.