హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.వెయ్యి కోట్లు సంపాదించుకున్నారంటూ రాజేందర్ వ్యాఖ్యానించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రూల్స్‌కు విరుద్ధంగా రాజేందర్ మాట్లాడారని స్పీకర్‌కు చేసిన ఫిర్యాదులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. రూల్ 319 (ii & iii) ప్రకారం ఒక సభ్యుడు మాట్లాడేటప్పుడు ఇతర సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు చేయకూదన్నారు. ఈ మేరకు రికార్డుల నుంచి రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలను తొలగించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోరారు.