పార్టీ మారినోళ్లపై చర్యలు తీస్కోండి

  • అసెంబ్లీ సెక్రటరీని కోరినబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ న‌‌‌‌ర‌‌‌‌సింహాచారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద‌‌‌‌, పాడి కౌశిక్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో క‌‌‌‌లిశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం ఇచ్చారు. దానం నాగేందర్‌‌‌‌, క‌‌‌‌డియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని, ఆ తీర్పును అమలు చేసి అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

పార్టీ మారిన దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌, కడియం శ్రీహరి మోసగాళ్లు అని కౌశిక్‌‌‌‌రెడ్డి దుయ్యబట్టారు. ఆ ఇద్దరి ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయమని, త్వరలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా మాజీలు అవుతారని అన్నారు.