రైతులకు అండగా బీఆర్ఎస్ : రసమయి

8 ఏళ్ల క్రితం రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని..కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంటు ఇచ్చిందని ఎమ్మెల్యే రవి శంకర్ తెలిపారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు రవి శంకర్,రసమయి బాలకిషన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.  బీఆర్ఎస్ వచ్చాక రైతుల గోస, చేనేత కార్మికులు బాధలు తొలగిపోయాయని ఎమ్మెల్యే రవి శంకర్ అన్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులు ఆగి పోయాయన్నారు..కేటీఆర్ నాయకత్వంలో 15 డైరెక్టర్ స్థానాలు గెలుచుకుంటమని.. సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగుర వేస్తమని తెలిపారు.

అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్..రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉందన్నారు. రైతుకి బీఆర్ఎస్ కి చాలా సంబంధాలు ఉన్నాయని తెలిపారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.  మోటార్ ల వద్ద మీటర్లు పెట్టేందుకు నరేంద్ర మోడీ చూస్తున్నారని రసమయి ఆరోపించారు. కరెంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.