- డ్రగ్స్ బయటపడ్డ ప్రతిసారి వాళ్లు మాట్లాడుతుండ్రు
- కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి
- కేసీఆర్ డీజీపీకి ఫోన్ చేసి ఇబ్బంది పెడ్తుండు
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ వ్యవహారం బయటికొచ్చిన ప్రతి సారి ఆ పార్టీ ఎమ్మెల్యేలు బయటికి వచ్చి మాట్లాడుతున్నారని ఆరోపించారు. సిగ్గు, శరం ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్ పాకాలా, విజయ్ మద్దూరిని వెనకేసుకు రావడానికి కేటీఆర్ కు సిగ్గుండాలని ఫైర్ అయ్యారు.
విజయ్ మద్దూరి కేటీఆర్ బినామీ అని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. గత ప్రభుత్వం డ్రగ్స్ కేసును ఎలా దారి మ ళ్లించిందో అందరికీ తెలుసన్నారు. జన్వాడ పామ్ హౌస్ అంటే నే కాంట్రవర్సీ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ ప్రీ రాష్ట్రంగా చేస్తుంటే.. వాళ్ళు డ్రగ్స్ ని ప్రేరేపించాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఏం చేయాలనుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్ పాకాల తనకు డ్రగ్స్ ఇచ్చారని విజయ్ ఒప్పుకున్నారని చెప్పారు. ఇప్పుడు స్టేట్ మెంట్ మార్చుతున్నారని మండిపడ్డారు. ఫాంహౌస్ దొర కేసీఆర్ డీజీపీకి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఈ కేసులో ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమిటో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ బయటికి రావాలని, ఆయన ఎక్కడ ఉన్నారని ప్రజలు అడుతున్నారని అన్నారు.