హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీకి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోజుకో యూనిఫాం ధరించి వస్తున్నారు. మొన్న లగచర్ల రైతులకు బేడీలు వేశారని నిరసన తెలిపేందుకు బ్లాక్ షర్టులు ధరించి చేతులకు బేడీలు వేసుకొని అసెంబ్లీకి వచ్చారు.
నిన్న ఆటో వాలాకు న్యాయం చేయాలని కోరుతూ ఖాకీ షర్టులు వేసుకొని ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు. ఇవాళ గ్రీన్ కండువాలు ధరించి అసెంబ్లీలో కనిపించారు. ఇదిలా ఉండగా సెషన్ ప్రారంభమైన రోజు కూడా అదానీ, రేవంత్ ఫొటోలు కలిగిన టీషర్టులు ధరించి అసెంబ్లీలోకి వచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్ది సేపు వాగ్వాదం జరిగింది.