అసెంబ్లీకి ఆటోల్లో వచ్చిన ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా సభకు ఆటోల్లో వచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. మహిళలకు ఫ్రీ బస్సు వల్ల.. ఆటో కార్మికులు వీధిన పడ్డారని.. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. అసెంబ్లీ ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు ఎమ్మెల్యేలు. 

నిన్నా మొన్నటి వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేల హోదాలో, మంత్రి హోదాలో రయ్ రయ్ మంటూ కార్లలో సైరన్ వేసుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఆటోల రావటం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని హామీ ఇచ్చింది. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే హామీ అమలు చేసింది. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 7వ తేదీ వరకే 15 కోట్ల ఉచిత టికెట్లు కొట్టింది ఆర్టీసీ.. అంటే మహిళలకు ఎంత ప్రయోజనం కలిగిందో అర్థం అవుతుంది. 

ఈ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఆటోవాలాలకు బేరాలు తగ్గాయని.. ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపింది. కొన్ని వెసలుబాట్లు కల్పించటంతోపాటు ఆర్థికంగా ఏడాదికి కొంత నగదు ఇవ్వాలనే ఆలోచన చేస్తుంది. ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు హామీ కూడా ఇచ్చింది ప్రభుత్వం. 

Also Read:మహిళలకు ఫ్రీ బస్సు ఉండాలా.. వద్దా