బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. విఠల్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు : హైకోర్టు

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. దండె విఠల్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు వెల్లడించింది.  కాంగ్రెస్‌ నేత పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది.  అంతేకాకుండా   విఠల్ కు రూ.50 వేల జరిమానా విధించింది. ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో విఠల్‌ ఎన్నికయ్యారు. 

ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్‌ ఉపసంహరణ పత్రాలిచ్చారని రాజేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది.   కోర్టు తీర్పుతో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విఠల్ తర్వాత స్థానంలో నిలిచిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే అవకాశం ఉంది.

 కాగా ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి  పోటీ చేసి 667 ఓట్ల మెజారిటీతో గెలిచి 2021 డిసెంబరు 14న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు విఠల్.  2022 ఫిబ్రవరి 21న శాస‌న‌మం‌డలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.