
- కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిండు
- చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ దాసోజు పోలీసులకు ఫిర్యాదు
జూబ్లీహిల్స్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కోరారు. సోమవారం బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్రాఘవేంద్రను కలిసి ఫిర్యాదు అందజేశారు. బండి సంజయ్చిల్లర వ్యక్తిలా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసీఆర్‌కు కర్నాటకలోని బీదర్‌లో నోట్ల ప్రింటింగ్ప్రెస్ఉందంటూ బండి సంజయ్ చేసిన ఆరోపణల వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎలాంటి చేసినా వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. దాసోసు శ్రవణ్వెంట బీఆర్ఎస్నేతలు గెల్లు శ్రీనివాస్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, వెల్దండి వెంకటేశ్ ఇతర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.