వడగండ్ల నష్టంపై రివ్యూ చేసే తీరిక లేదా ? : బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వడగండ్ల నష్టంపై రివ్యూ చేసే తీరిక లేదా ? : బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం మాటలకే పరిమితం
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఖమ్మం, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌ మాటల ప్రభుత్వమే తప్ప, చేతల ప్రభుత్వం కాదని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదివారం ఖమ్మంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇంట్లో మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎంతో పాటు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ.. వడగండ్ల వాన వల్ల జరిగిన నష్టంపై ఇప్పటివరకు రివ్యూ చేయలేదన్నారు. ధాన్యం తడిసి, మామిడి రాలిపోయి రైతులు కష్టాల్లో ఉంటే.. కనీసం సమీక్షించే తీరిక కూడా లేదా అని ప్రశ్నించారు.

వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రతి ఎకరానికి రూ. 20 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఇంకా 60 శాతం మందికి రుణమాఫీ కాలేదని, రైతు కూలీలకు ఇస్తామన్న ఆత్మీయ భరోసా డబ్బులు ఇవ్వనేలేదన్నారు. కాంగ్రెస్‌‌‌‌ పథకాలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌‌‌‌, మాజీ ఎమ్మెల్యేలు బానోతు చంద్రావతి, మదన్‌‌‌‌లాల్‌‌‌‌, హరిప్రియ, కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు.