కవిత బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా : కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం

కవిత బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా : కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం
  • = ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీం అసహనం

  • = ఈ నెల 27వరకు టైం ఇచ్చిన బెంచ్

  • = 28లోపు రిజాయిండర్ వేయాలని కవిత తరఫు అడ్వొకేట్లకు ఆదేశం

ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇవాళ జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్ పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

శుక్రవారం లోపు అంటే ఆగస్ట్ 23వ తేదీలోపు కవిత తరఫు న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టులో కేసు డెరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఆలస్యమెందుకని ఈడీని కోర్టు ప్రశ్నించింది. ఈ సందర్బంగా కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపిస్తూ.. మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలని తెలిపింది. ఇదే కేసులో సహనిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అర్వింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేశారని, కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు.

లిక్కర్ స్కాం కేసు విచారణ పూర్తయందని, చార్జిషీట్ కూడా ఫైల్ చేసినందున బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.