అర్వింద్ ఇష్టానుసారంగా మాట్లాడుతుండు.. ఇది మంచి పద్దతి కాదు : కవిత

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన బాధ్యతలను విస్మరించి ఇష్టానుసారంగా, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.  అర్వింద్ వ్యాఖ్యల పై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో వీడియో రిలీజ్ చేశారు కవిత.  రాజకీయాల్లో గెలుస్తుంటాం ఓడుతూ ఉంటాం కానీ వ్యక్తిగతంగా విమర్శలు చెయ్యొద్దని  సూచించారు.  

అర్వింద్  తనను అనే మాటలు  మీ ఇంట్లో ఆడవాళ్లను అంటే మీరు పడుతారా అంటూ  తెలంగాణ ప్రజలను కవిత కోరారు.   తెలంగాణ రాజకీయాల్లో ఇంత దిగజారి మాట్లాడుతున్నా వ్యక్తిని పోత్సహిద్దామా అని ప్రశ్నించారు.   ఆడవాళ్లపై ఇలాంటి ఆరోపణలు చేయడంతోనే మహిళలు బయటకు వచ్చి బ్రతకాలన్న, రాజకీయం చేయాలన్న భయంగా ఉంటుదని చెప్పారు.  

వ్యక్తిగతంగా ఎంత పెద్ద సమస్య వచ్చినా తాను ఎదుర్కొంటానని చెప్పిన కవిత..  అర్వింద్  మాటలను మాత్రం నిలువరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.  తెలంగాణ ఉద్యమంలో కూడా సమస్య ప్రధానంగానే మాట్లాడాము కానీ వ్యక్తిగత  దూషణలకు పోలేదని, అలాంటి సంప్రాదాయం మంచిది కాదని చెప్పారు.