మహబూబ్ నగర్ జిల్లాకు తనకు ఓ ప్రత్యేక అనుబంధం ఉందని.. కేసీఆర్, ఇక్కడి నుంచి పోటీ చేసిన నాటినుంచి తనకు అనుబంధం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనకుకు నిజామాబాద్ ఎట్లనో.. మహబూబ్ నగర్ అట్లేనని చెప్పారు. ఇక్కడి ఎంపీగా ఉండే.. కేసీఆర్ తెలంగాణ సాదించాడని... అది చాలా గర్వ కారణమన్నారు ఆమె. జనవరి 9వ తేదీ మంగళవారం జిల్లా కేంద్రంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ జిల్లా నుంచి వలసలు ఎట్లా ఆపాలో.. చాలా స్టడీ చేసినమని తెలిపారు. ఇక్కడ సాగు యోగ్య భూమి 35 లక్షల ఎకరాలు ఉండి.. నీరు లేకనే ప్రజలు వలస పోతున్నరని.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ వెంటనే 11 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చారని చెప్పారు. ఎన్నికలలో మనం ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు.. కానీ మనం ఉద్యమ కారులం.. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి.. పోరాడాలి.. అదైర్య పడాల్సిన పనిలేకుండా ముందుకు సాగాలని కార్యకర్తులకు పిలుపునిచ్చారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో 90 శాతం పనులు పూర్తి అయ్యాయి.. మిగతా 10 శాతం పనులు మాత్రమే పూర్తి కావాలని అన్నారు. ఇదే పాలమూరు నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారని.. కానీ, ఈ ప్రాజెక్టు టెండర్లు కాన్సల్ చేస్తామంటున్నారని.. ఎందుకు చేస్తారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దీనపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అన్నారు.
చివరి అనుమతుల కోసం సీఎం రేవంత్ యత్నించాలన్నారు. ప్రధాని మోడీతో కేసీఆర్ కు సత్సంబంధాలు లేనందుకే.. కేంద్రం సహకరించ లేదని సీఎం రేవంత్ అన్నారు.. మరి మీరు సత్సంబంధాలు పెట్టుకోండి.. లేదా కొట్లాడండి.. కానీ, పనులు చేయండని అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు కొత్త పెన్షన్స్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఉసే లేదని... ప్రభుత్వానికి వంద రోజులు టైమ్ ఇస్తామని.. హామీలు నెరవేర్చకపోతే ప్రజల తరుపున కొట్లాడుతామని హచ్చరించారు కవిత. పార్లమెంట్ లో తెలంగాణ కోసం పొరాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని.. కాబట్టి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్తులను గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.