మొన్న పుసుపు బోర్డులు.. ఇవాళ మిర్చీ దండలు.. కవిత వినూత్న నిరసన

మొన్న పుసుపు బోర్డులు.. ఇవాళ మిర్చీ దండలు.. కవిత వినూత్న నిరసన

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్న  పసుపు రైతుల సమస్యలపై పసుపునకు రూ. 15 వేలు చెల్చించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుఒని మండలికి వచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ మిర్చి దండలు వేసుకొని కౌన్సిల్ కు హాజరయ్యారామె.  మిర్చి రైతులు సమస్యలు పరిష్కరించాలని, క్వింటాకు 25వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయింది. ధర లేక ఈ సీజన్లో 2లక్షల 40 వేల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతోందని ఆము ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి  నాఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి మద్దతు ధర క్వింటాల్ కు ఇరవై ఐదు వేల రూపాయలు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలన్నారు.

ALSO READ | వేమలవాడలో ఓ పక్క పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణం..మరోపక్క శివయ్యను పెళ్లాడిన జోగినీలు.. హిజ్రాలు