కులగణనపై సర్కారువి కాకి లెక్కలు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కులగణనపై సర్కారువి కాకి లెక్కలు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కరీంనగర్, వెలుగు : కులగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాకి లెక్కలు ప్రకటించిందని బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీలు 46.2 శాతం మాత్రమే ఉన్నట్లు చెప్పడం., 8 శాతం ఉన్న ఓసీలు.. 15 శాతానికి పెరిగారని ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్​లోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి సోమవారం ఆమె నివాళులర్పించి మాట్లాడారు. 

బీసీ కులగణనను అందరూ స్వాగతించాల న్నారు. జాగృతితో పాటు బీసీ సం ఘాలు, రాజకీయ పార్టీలు చేసిన ఉద్య మానికి తలొగ్గి కాంగ్రెస్ సర్కారు  డెడికేటెడ్  బీసీ కమిషన్  ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిషన్  ద్వారానే కులగణన చేపట్టాలని తాము డిమాండ్  చేస్తే.. తమ మాట పట్టించుకోకుండా ప్లానింగ్ డిపార్ట్ మెంట్  నుంచి నిర్వహించారని ఆమె ఆరోపించారు.