Kavitha: హైదరాబాద్కు చేరుకున్న కవిత

Kavitha: హైదరాబాద్కు  చేరుకున్న కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న కవిత దాదాపు ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర బీఆర్ఎస్  నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీలతో ఆమెకు  ఘనస్వాగం  పలికారు. కవిత వెంట ఆమె భర్త అనిల్, కేటీఆర్, హరీశ్ రావు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆమె నివాసానికి వెళ్లనున్నారు కవిత. 

పోరాటం కొనసాగుతుంది

లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో  ఆగస్ట్ 27న సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే..153 రోజులు జైల్లో ఉన్న కవిత 27న రాత్రి 8గంటల 10 నిముషాలకు జైలు నుంచి విడుదల అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన  కవిత..  న్యాయం గెలిచిందని..తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.తనను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పారు.

ట్రయల్ కోర్టుకు కవిత

ఆగస్టు 28న ఉదయం లిక్కర్ స్కాం కేసులో కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు వర్చువల్ గా హాజరయ్యారు.  సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ పై విచారణ జరిగింది. క్వాలిటీ డాక్యుమెంట్స్ ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు. దీంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది కోర్టు. విచారణ అనంతరం కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు కవిత.

ALSO READ | కవిత బెయిల్ కు బీజేపీ మద్దతు : సీఎం రేవంత్ రెడ్డి