ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో దాదాపు ఐదు నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన కవిత కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. భర్తను, కొడుకు, కేటీఆర్, హరీశ్ రావుతో కన్నీరు పెట్టుకున్నారు.
కవితకు స్వాగతం పలికేందుకు ఢిల్లీలోని తిహార్ జైలు దగ్గరకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా వచ్చారు. గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, బాల్క సుమన్, ముత్తిరెడ్డి, కౌశిక్ రెడ్డి, సహా పలువురు జైలు దగ్గర ఉన్నారు. ఆగస్టు 28 మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు కవిత.
153 రోజులు జైల్లోనే
2023 మార్చి 15 సాయంత్రం ఈడీ కవితను అరెస్ట్ చేసి.. ఢిల్లీ తరలించింది. కవిత153 రోజుల పాటు తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆగస్ట్ 27న సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ,సీబీఐ కేసుల్లో బెయిల్ కు గానూ ఆమె రూ10 లక్షల ష్యూరిటీ బాండ్ కోర్టుకు సమర్పించాలి. అంతేకాకుండా కేసు నమోదు అయిన స్థానిక మేజిస్ట్రేజ్ కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లాలంటే మెజిస్ట్రేట్ కోర్టు పర్మీషన్ తీసుకోవాలి. లిక్కర్ స్కాం కేసులో సాక్ష్యాలను, సాక్షులను ప్రభావితం చేయకూడదని చెప్తూ ఈ మూడు కండీషన్లతో బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం కేసులో తర్వాతి విచారణకు సహకరిస్తూ.. వాయిదాలకు హాజరుకావాలని సూచించింది సూప్రీం కోర్టు.