సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అందుకే మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారన్నారు. గాంధీల కుటుంబాన్ని చూసి మైనారిటీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారన్నారు కవిత. కానీ ఇప్పుడు మైనారిటీల నమ్మకాన్ని రేవంత్ వమ్ము చేస్తున్నారన్నారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మత కల్లోలం కూడా జరగలేదని విమర్శించారు కవిత. మతకల్లోలాలను నిరోధించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? గంగాజమునా తెహజీబ్ లా ఉన్న తెలంగాణలో చిచ్చుపెడుతున్నారు. మైనారిటీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. మైనారిటీ డిక్లరేషన్ అమలు ఏమైంది ?. మైనారిటీ డిక్లరేషన్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మైనారిటీలకు కేటాయించిన బడ్జెట్ లో కనీసం 25 శాతం కూడా ఖర్చు చేయలేదు. వేల కోట్లు కేటాయించి కేవలం 700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. షాదీ ముబారక్ కింద రూ. 1.6 లక్షలతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ ఎగ్గొట్టారు అని కవిత విమర్శించారు.
ALSO READ | కౌశిక్ రెడ్డిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం: మంత్రి శ్రీధర్ బాబు