తన పై తప్పుడు కేసు బనాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తాత్కాలికంగా జైలులో పెడతారేమో కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరని అన్నారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. తాను తప్పు చేయలేదు అప్రూవర్ గా మారనని కవిత అన్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదు పొలిటికల్ కేసు అని అన్నారు. స్కాంలో ఒక నిందితుడు బీజేపీలో చేరాడని మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ రూ. 50 కోట్లు ఇచ్చారని విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత 10 రోజుల కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపర్చారు. కవితను మరో రెండ్రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనుంది.
రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు కవితను హాజరుపరిచారు. ఈడీ కస్టడీకి అనుమతి ఇవ్వకపోతే 14 రోజుల జ్యుడిషయల్ కస్టడీ విదించే చాన్స్ ఉంది. ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీ విధిస్తే ఇవాళ మధ్యాహ్నం కవితను తీహార్ జైలుకు తరలిస్తారని తెలుస్తోంది.