ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత 

ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత 

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్‌‌‌‌‌‌‌‌ జైల్లో కస్టడీలో ఉన్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ కవిత మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు సిబ్బంది ఆమెను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్‌‌‌‌కు తరలించి, చికిత్స అందించారు. జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతుండటంతో ఆమెను మంగళవారం సాయంత్రం దవాఖానకు తరలించామని జైలు అధికారులు వెల్లడించారు.

వైద్య పరీక్షల తర్వాత తిరిగి జైలుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు కేసుల్లో ప్రస్తుతం కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. కవిత అరెస్టై 4 నెలలు అవుతుండగా, ఇప్పటివరకూ పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినప్పటికీ ఆమెకు బెయిల్ మంజూరు కాలేదు. ఈ నెల 22న మరోసారి కవిత బెయిల్ పిటిషన్ రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణకు రానుంది.