గ్యాస్ ​ధర పెంచి గుదిబండను మోపింది : కవిత

గ్యాస్ ​ధర పెంచి గుదిబండను మోపింది : కవిత
  • ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: మహిళా సంక్షేమాన్ని మరచిపోయిన కేంద్ర ప్రభుత్వం.. గ్యాస్​ ధరను రూ.50 పెంచి గుదిబండమోపిందని బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్​ ధరలు తగ్గుతుంటే ఇక్కడ మాత్రం పెట్రోలియం ఉత్పత్తులపై ధరలు పెంచడమేంటని నిలదీశారు. బుధవారం తెలంగాణ మహిళా సాధికారత సమాఖ్య సంఘం సభ్యులు కవితను ఆమె నివాసంలో కలిశారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. మహిళా సంఘాలకు కేంద్రం రూ.15 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్పొరేట్​ కంపెనీలకు రూ.16.5 లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రానికి మహిళలకు ఇచ్చేందుకు మాత్రం మనసు రావడం లేదని మండిపడ్డారు.