పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో తట్ట మట్టి కూడా ఎత్తలేదు : ఎమ్మెల్సీ కవిత

పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో తట్ట మట్టి కూడా ఎత్తలేదు : ఎమ్మెల్సీ కవిత
  • రాష్ట్ర ప్రభుత్వంపై కవిత ఫైర్

నాగర్ కర్నూల్  టౌన్, వెలుగు:  కాంగ్రెస్  అధికారంలోకి వచ్చి 15  నెలలైనా  పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక తట్ట మట్టి కూడా తీయలేదని బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్​లోని బీఆర్ఎస్ ఆఫీస్​లో మీడియాతో ఆమె మాట్లాడారు. తమ హయాంలో ఆ ప్రాజెక్టు​ పనులు 60 శాతం జరిగాయన్నారు. తాము  చెరువుల ద్వారా నీళ్లిచ్చి రైతులను ఆదుకున్నామని,  కాంగ్రెస్  రాగానే  మళ్లీ కరువు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. 

పాలమూరు జిల్లాలో భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను కాంగ్రెస్  నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం రేవంత్  రెడ్డి సొంత జిల్లాలో ఎస్ఎల్​బీసీ టన్నెల్​  ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుంటే  సీఎం ఘటనా స్థలానికి వెళ్లలేదన్నారు. ప్రమాదాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్  ప్రజాప్రతినిధులు పార్టీ మీటింగ్​కు వెళ్లారని మండిపడ్డారు.