పోలీసులు ఫస్ట్ సీఎం రేవంత్పై కేసు పెట్టాలి.. లేకపోతే కోర్టుకెళ్తం: కవిత

బీఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యే  బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు ఎమ్మెల్సీ కవిత.  నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుందని విమర్శించారు.  సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోవొద్దని ట్వీట్ చేశారు కవిత. 

 కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి  అసభ్య పదజాలాన్ని ప్రయోగించినందుకు ముందుగా రేవంత్ రెడ్డిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలన్నారు.  లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని  ట్వీట్ చేశారు కవిత. 

 సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో జనవరి 5న  మంచిర్యాల జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్‌పై సెక్షన్లు 294బీ, 504, 506 సెక్షన్లపై కేసు నమోదు చేశారు.   బాల్క సుమన్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.