
గండిపేట, వెలుగు: బీఆర్‌ఎస్ సీనియర్ నేత గట్టు రామచందర్‌రావును ఎమ్మెల్సీ కవిత మంగళవారం పరామర్శించారు. మణికొండ అల్కాపురి కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లిన కవిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందవద్దని, అంతా సర్దుకుంటుందని చెప్పారు. ఆమె వెంట మణికొండ మున్సిపల్ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.