బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

కరీంనగర్ జిల్లా:   బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.  శంకరపట్నం మండలం తాడికల్ వద్ద కౌశిక్ రెడ్డి కాన్వాయ్ కి ఓ బైకు అడ్డుగా వచ్చింది. దీంతో దానిని తప్పించే క్రమంలో రోడ్డు ప్రక్కనున్న చెట్టును కారు ఢీ కొంది. కారు రోడ్డు పక్కన పంటపొలాల్లోకి దూసుకెళ్లింది.   కారులోని  ఎయిర్‌ బెలూన్లు ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో కౌశిక్ రెడ్డి బయటపడ్డారు.  

Also Read : సికింద్రాబాద్​లో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పర్యటన

కౌశిక్ రెడ్డి కరీంనగర్ నుంచి హుజురాబాద్  వెళ్తుండగా ఈ ప్రమాదం  చోటుచేసుకుంది.   బైక్ పై వస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో వెంటనే  హుజురాబాద్ ఆసుపత్రి కి తరలించారు. మరో కారులో హుజురాబాద్ కు వెళ్ళిపోయారు కౌశిక్ రెడ్డి.   కౌశిక్ రెడ్డికి ప్రాణాపాయం తప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఊపిరి పిల్చుకున్నారు.  

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ఈరోజు జరిగే 2K రన్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి హుజురాబాద్ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఓ భారీ వృక్షం ఉండగా.. దాన్ని ఢీకొట్టి ఉంటే మాత్రం పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.