మోత్కూరు ఎమ్మెల్యే సమక్షంలో..కాంగ్రెస్​లో  చేరికలు

మోత్కూరు, వెలుగు : బీఆర్ఎస్ మోత్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, కౌన్సిలర్ లెంకల సుజాతవేణు, కోఆప్షన్ మెంబర్లు గనగాని నర్సింహ, ఎండి.నబీతో పాటు 50 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు ఆదివారం మోత్కూరులో ఎమ్మెల్యే సామేల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతంతో పాటు ఎంపీ ఎన్నికల్లో గెలుపు కోసం అందర్నీ కలుపుకుని పని చేయాలన్నారు

కాంగ్రెస్ లో చేరిన వారిలో బీజేపీ మున్సిపల్ మాజీ అధ్యక్షుడు బయ్యని రాజు, గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరి, ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు బొల్లెపల్లి సీతయ్య, ఎండీ మునీర్, అంతటి నర్సయ్య తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పైళ్ల సోమిరెడ్డి, డాక్టర్ జి.లక్ష్మీ నర్సింహారెడ్డి   పాల్గొన్నారు.