యాసంగి పంటకు బోనస్ ఇవ్వాలి : వినోద్ కుమార్

యాసంగి పంటకు బోనస్ ఇవ్వాలి : వినోద్ కుమార్

కోనరావుపేట, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలుచేయాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో పలు గ్రామాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం యాసంగి పంటకు క్వింటాల్‌‌కు రూ.500 బోనస్  ఇవ్వాలని డిమాండ్​ చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన పిల్లర్లకు రిపేర్​ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు. ఐదేళ్లలో ఎంపీగా బండి సంజయ్ చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్‌‌ లీడర్లు చల్మెడ లక్ష్మీనరసింహరావు, చంద్రయ్య గౌడ్, రామ్మోహన్ రావు, నర్సయ్య, దేవయ్య, ప్రభాకర్ రావు పాల్గొన్నారు. 

ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
 

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఎండిన పంటలకు ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం, పంటలకు సాగునీరు ఇవ్వాలని కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబుకు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌ మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటి నిర్వహణలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఫెయిలైందన్నారు. వారి వెంట జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మెట్ పెల్లి ఎంపీపీ సాయి రెడ్డి, రాజేశ్‌‌ పాల్గొన్నారు.
 

బండి సంజయ్‌‌ది దొంగదీక్ష
 

కరీంనగర్ టౌన్,వెలుగు:  ఎంపీ బండి సంజయ్ కరీంనగర్‌‌‌‌లో చేసింది దొంగ దీక్ష అని మాజీ  ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  ఎద్దేవా  చేశారు. రైతుసమస్యలపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీరామకృష్ణారావు, సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ తో కలిసి మంగళవారం కలెక్టర్‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ కాళేశ్వరం, పాలమూరు తదితర ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వని బీజేపీ దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజీపీ, కాంగ్రెస్‌‌లు ఏనాడూ రైతుల్ని పట్టించుకోలేదని విమర్శించారు. కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్సి నారదాసు లక్ష్మణ్​ రావు, రవీందర్ సింగ్, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.