సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం, సూరంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి తీవ్ర గాయం అయ్యిందా.. ఆయన పొట్టలో కత్తి దిగిందా.. అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దాడి తర్వాత.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. తన చేతిని పొట్టపై పట్టుకోవటం, కార్యకర్తలు కూడా ఆయన పొట్టపై చేతులు గట్టిగా పెట్టి ఉండటం చూస్తుంటే.. ఆయన పొట్టలో కత్తి దిగినట్లు తెలుస్తుంది. ఇది ఎంత లోతులో దిగింది.. ఎంత వరకు గాయం అయ్యిందీ అనేది డాక్టర్లు చెప్పాల్సి ఉంది.
కత్తితో పొట్టపై గాయం తీవ్రత ఎంత అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. దాడి తర్వాత ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. పొట్టపై తన చేతిని బలంగా అదిమి ఉంచటం విజువల్స్ తో స్పష్టంగా కనిపిస్తుంది. దాడి తర్వాత ఏ మాత్రం ఆలస్యం కాకుండా.. నిమిషాల వ్యవధిలోనే ఆయన ఆస్పత్రికి చేరుకున్నారు. ఎంపీ కావటంతో.. ఈలోపే గజ్వేల్ ఆస్పత్రిలో డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. వెంటనే చికిత్స మొదలుపెట్టారు.
Also Read :- మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి
దాడి తర్వాత వెంటనే గజ్వేల్ ఆస్పత్రికి వెళ్లిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి.. చికిత్స కోసం తరలించనున్నట్లు సమాచారం. దాడి విషయం తెలిసిన వెంటనే.. మంత్రి హరీష్ రావు ఫోన్ లో పరామర్శించటమే కాకుండా.. గజ్వేల్ ఆస్పత్రికి వెళ్లి.. ఎంపీని స్వయంగా పరామర్శించనున్నారు.